దసరా తర్వాత తెలంగాణపై స్పష్టత: ఎంపీ ఉండవల్లి

కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యల్లో తప్పేమి లేదని కాంగ్రెసు సీనియర్ నేత రుద్రరాజు పద్మరాజు అన్నారు. ప్రణబ్ సీనియర్ రాజకీయ వేత్త అని ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటుందన్నారు. రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటన మానవ తప్పిదాల్లో ఒకటన్నారు. కేంద్రం ఆ తర్వాత 23వ తారీఖున చేసిన ప్రకటనను తెలంగాణవాదులు అర్థం చేసుకోవాల్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు పూటకో నీతిగా ఉందన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి అన్నారు. ఊసరవెల్లి ఎలా రంగులు మారుస్తుందో బాబు అలా మారుస్తారన్నారు. కాంగ్రెసు జాతీయ పార్టీ అని తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications