ప్రణబ్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాములమ్మ, పొన్నం

Vijayashanthi-Ponnam Prabhakar
హైదరాబాద్: కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై ప్రణబ్ వ్యాఖ్యలు డొంక తిరుగుడుగా ఉన్నాయని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణకు దేశంలోని ఇతర రాష్ట్రాల డిమాండ్లకు సంబంధం లేదన్నారు. ఆయన చెప్పినట్లు తాము కొత్త రాష్ట్రాన్ని అడగటం లేదని గతంలో ఉన్న రాష్ట్రాన్ని ఇవ్వమని చెబుతున్నామన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అమాయకంగా కాంగ్రెసును నమ్ముతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెసు నిమజ్జనం కావడం ఖాయమన్నారు. ప్రణబ్ వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు.

తెలంగాణ కోసం నిర్ధిష్ట కాలపరిమితి కావాలని తాము అధిష్టానాన్ని కోరలేదాని తక్షణమే తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయని, యాభయ్యారేళ్ల ఉద్యమమని స్వయంగా ప్రణబ్ చెప్పారన్నారు. తెలంగాణపై కేంద్రం పూటకో మాట మాట్లాడ వద్దని కోరారు. అలా అయితే తాము కాంగ్రెసు నేతలుగా తెలంగాణలో తిరిగే ప్రసక్తి ఉండదన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెసు ఇప్పటికీ అనేక సమస్యలకు పరిష్కారం చూపించిందని అలాంటిది తెలంగాణ ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అని చెప్పుకుంటున్నామని అదే జరగకుంటే చచ్చేది కూడా తామే అన్నారు. తెలంగాణ బాధ్యత కాంగ్రెసుదే అన్నారు. ఇతర రాష్ట్రాల డిమాండుతో తెలంగాణకు సంబంధం లేదన్నారు.

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ పూటకో మాట మాట్లాడుతుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇస్తామని వారే చెప్పారు. ఇప్పుడు ఇవ్వమని వారే చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మరోసారి మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీనికి సమాధానం చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+