తెలంగాణ నేతలు అధిష్టానాన్ని ధిక్కరిస్తారా?

Telangana
హైదరాబాద్: తెలంగాణ సమస్యకు నిర్దిష్ట కాలపరిమితి చెప్పలేమని ఇది చాలా క్లిష్టమైన సమస్య అని కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం చేసిన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం యుపిఏ ప్రభుత్వానికి లేదని చూచాయగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి ఇప్పుడు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులపై పడింది. వారు ఇప్పుడు ఏం చేస్తారు? అధిష్టానాన్ని ధిక్కరిస్తారా? లేదంటే అధిష్టానానికి కట్టుబడి ఉంటారా? అనేది చర్చనీయాంశమైంది. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారికంగా చెప్పిన కేంద్రం ఇప్పుడు తెలంగాణను ఇవ్వలేమని దాదాపు తేల్చిసిందనుకోవచ్చు. ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీ పైన, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. ఎక్కడ మాట్లాడిన అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే నమ్మకముందనే చెప్పుకుంటూ వచ్చారు.

అధిష్టానంపై నమ్మకముంచి వాళ్లు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. నేతలతో చర్చించారు. చర్చించిన ప్రతీసారి అధిష్టానం సానుకూలంగాస్పందించిందని చెప్పారు. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తన వైఖరి బహిరంగంగా ప్రకటించక పోవడం, కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేయక పోవడంతో టి-నేతలకు తెలంగాణ ప్రజలకు సర్ది చెప్పుకునే అవకాశం వచ్చింది. కానీ ప్రణబ్ వ్యాఖ్యల ద్వారా దాదాపు ఇవ్వమని తేల్చేశారు. దీంతో ఇప్పుడు వారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోనున్నారు చూడాల్సి ఉంది. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే తాము పార్టీని వీడటం తప్ప చేసేదేమీ లేదని వారు బహిరంగంగానే ప్రకటనలు గుప్పించారు. రాజ్య సభ సభ్యుడు కె కేశవ రావు, ఎంపీలు పొన్నం ప్రభాకరం, మందా జగన్నాథం, వివేక్, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానానికి తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెసు భూస్థాపితం కాక తప్పదని హెచ్చరికలు పంపించారు.

మరోవైపు సకల జనుల సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రం తెలంగాణను ఇప్పట్లో తేల్చలేమని చెప్పడంతో పలువురు కాంగ్రెసు నేతలు పార్టీ నుండి బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ప్రణబ్ ప్రకటన స్పష్టంగా కనిపిస్తుండటంతో పార్టీ నుండి బయటకు రాకపోతే ప్రజల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వారు పార్టీ వీడి గతంలో పలువురు ప్రకటించిన మాదిరిగానే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కొట్టి పారేయలేము. అయితే వీరు గతంలో మాదిరిగా మెత్తబడతారా లేక పార్టీని ధిక్కరిస్తారా అనేది త్వరలో తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+