చంద్రబాబుకు దూరమైన జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ సర్గీయ ఎన్టీ రామారావు, బాబాయ్ బాలయ్య పేర్లను ఉచ్చరించకుండా మాట్లాడని స్థితి వచ్చేసింది. నందమూరి కుటుంబానికి సంబంధించిన ప్రతి సినీ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులంతా పాల్గొనేవారు. బాలయ్యతో పాటు కళ్యాణ్ రామ్, తారకరత్న కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మెలిసి తిరిగారు. కానీ, తెలుగుదేశం పార్టీలోని పరిణామాలు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ను వారికి దూరం చేశాయి. తన తనయుడు లోకేష్‌ను తన వారసుడిగా రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. చంద్రబాబుపై తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పోరుకు సిద్ధపడ్డారు. దీంతో చంద్రబాబు కాస్తా వెనక్కి తగ్గారు.
హరికృష్ణ, చంద్రబాబు ఢిల్లీలో పక్కపక్కనే కనిపించడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందని భావించారు. కానీ అది పైకి మాత్రమేనని, లోలోపల పోరు రగులుతూనే ఉందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి ఆడియో విడుదల కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్ వారెవరూ లేకుండానే ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఒంటరి పోరాటం ద్వారా అవరసమైతే పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు అండదండలు అందిస్తున్న బాబాయ్ బాలకృష్ణ పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌పై మండిపడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications