ఢిల్లీలో తెలంగాణ వేడి: కావూరికి ఆజాద్ పిలుపు

శనివారం ఉదయం పూట చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదుకు తిరుగుముఖం పట్టారు. తనను చర్చలకు అధిష్టానం అహ్వానించలేదని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ హైదరాబాదులో చెప్పారు. తమ తరఫున అధిష్టానంతో కావూరి మాట్లాడుతారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకు ఉందని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశలో కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతోంది.












Click it and Unblock the Notifications