వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై బాబును ఫిక్స్ చేయనున్న కాంగ్రెసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఫిక్స్ చేసే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేసిన తర్వాతనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉంది. ఈ నెలఖారున గానీ వచ్చే నెల ఆరంభంలో గానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఈలోగా, జాతీయ పార్టీలతో చర్చలు జరుపుతామని కాంగ్రెసు పెద్దలు చెప్పారు.

అఖిల పక్ష సమావేశానికి ముందు కాంగ్రెసు తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు తన్పనిసరిగా ఓ వైఖరి అవలంబించాల్సి వస్తుందని అంటున్నారు. ఇంతకు ముందు పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు. అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు రెండేసి వెఖరులను చెప్పేసి తప్పుకున్నాయి. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెసు అధిష్టానం పార్టీకి ఒక్కరేసి ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించి పార్టీ వైఖరిని వెల్లడించాలని చెప్పే అవకాశాలున్నాయి.

తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెసు కోర్ గ్రూప్ మంగళవారం గానీ బుధవారం గానీ సమావేశమయ్యే అవకాశం ఉంది. గత రెండు నెలలుగా చేసిన సంప్రదింపులపై చర్చ చేసి ఈ సమావేశంలో కాంగ్రెసు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లీస్ పార్టీలు అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ వైఖరిని అఖిల పక్ష సమావేశంలో వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు చంద్రబాబు చిక్కులో పడక తప్పదని అంటున్నారు.

English summary
The Congress will shortly finalize its views on Telangana before it calls an all-party meeting to take a final decision on a problem that has paralyzed a third of Andhra Pradesh for close to four weeks now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X