సమ్మె సెగ మాకే ఎక్కువ, ఇక ఊరుకోం: ఐజి అనూరాధ

ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తమకు ప్రభుత్వం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు అందాయని చెప్పారు. హింసాత్మక చర్యలకు పూనుకుంటే ఇక నుండి సహించేది లేదన్నారు. సమ్మెతో నష్ట పోయేది సామాన్యులే అన్నారు. రైలు రోకో ఉన్నప్పటికీ గ్రూపు-2 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. స్వచ్చంధంగా బందు అంటూనే విద్యాసంస్థలను బలవంతంగా ఎందుకు మూసి వేయిస్తున్నారని ప్రశ్నించారు. రైలు రోకో వాయిదా స్వాగతిస్తున్నామని అయితే 15, 16, 17 తేదీల్లో గ్రూపు పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రయాణీకులకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు.
కాగా సకల జనుల సమ్మె, రైలు రోకో నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిజిపి దినేష్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డితో భైటీ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బలగాలు పెంచాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications