జగన్ తెలంగాణకు వ్యతిరేకమే: పార్టీ నేత వ్యాఖ్యలతో స్పష్టం

కడప ధర్నా కార్యక్రమంలో జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ సోదరుడు, మాజీ ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ నేత మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని జగన్ సమక్షంలోనే ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ కోత అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications