తెలంగాణ సమ్మెపై 20 నుంచి తిరుగుబాటు: టిజి వెంకటేష్

కేసీఆర్ సీమాంధ్రకు ఒక రకంగా మేలు చేస్తున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ పరిస్థితి చూసి ఎన్నారైలు, సీమాంధ్రులు, ఇతర పారిశ్రామికవేత్తలు ఎవరూ అక్కడ పెట్టుబడులు పెట్టడం లేదని, వారంతా సీమాంధ్రలో పెట్టుబడులు పెడుతుండటంతో ఇక్కడి భూముల ధరలు లక్షల్లో పలుకుతున్నాయని ఆయన అన్నారు. పరిశ్రమలన్నీ ఈ ప్రాంతాలకే వస్తున్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ అలా చేయకపోతే మనవాళ్లంతా హైదరాబాదులోనే పెట్టుబడులు పెట్టేవారని, దాంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందేదని చెప్పారు. తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు రావని కేసీఆర్ హామీ ఇస్తే కేంద్రం ఒక్క సెకన్‌లోనే తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications