సిఎం కిరణ్‌పై ఆజాద్‌కు తెలంగాణ ఎంపీల ఫిర్యాదు

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు మంగళవారం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీరు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. సమ్మె తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేయకుండా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసి ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని చెప్పారని సమాచారం. వారి ఫిర్యాదును గులాం నబీ ఆజాద్ సానుకూలంగా విన్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్యమాన్ని అణిచి వేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆయన చర్యలను అడ్డుకోవాలని కోరినట్లు సమాచారం.

ఉద్యమ పరిస్థితులపై ఆజాద్‌కు పూర్తిగా వివరించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో కొనసాగుతున్న సమ్మె తీవ్రతను కూడా వివరించారు. అయితే తెలంగాణపై కేంద్రం, పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తోందని త్వరలో నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆజాద్ ఎంపీలకు సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా ఆజాద్‌తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లారు. ఆజాద్‌తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. మరోవైపు తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరుతూ ఎంపీలు బుధవారం స్పీకర్ మీరాకుమార్‌ను కలవనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+