ధైర్యం ఉంటే ఎన్నికలకు రండి: జగన్ సవాల్

YS Jagan
కడప: అధికార కాంగ్రెసు పార్టీకి ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కడప జిల్లాలో సవాల్ విసిరారు. కరెంట్ పోరులో భాగంగా ఆయన కడప కలెక్టరేట్ ముందు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసుపై తీవ్రంగా విరచుకు పడ్డారు. కరెంటు కొరత కారణంగా ప్రజలు, రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని ఆరోపించారు. కరెంటును ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఇస్తారో ఎన్ని గంటలు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు.

సకల జనుల సమ్మె గురించి ముందుగా తెలిసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సమ్మె జరిగితే మంచిదేనని ప్రభుత్వం ఆలోచించిందన్నారు. ప్రస్తుతం రైతులు వ్యవసాయం కంటే ఉరి మేలనుకుంటున్నారన్నారు. అమాయకులపై పోలీసులు విరుచుకు పడితే అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనపై దొంగ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+