రాజీనామాలు ఆమోదించండి: స్పీకర్‌తో తెలంగాణ ఎంపిలు

మూడు రోజుల పాటు జరిగే రైల్ రోకో ఆందోళనలో తాము తమ తమ జిల్లాల్లో పాల్గొంటామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అక్టోబర్ నెలాఖరు నాటికి తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం వెలువరిస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. అయినా ఒత్తిడి పెంచడానికి ఆందోళనలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలంతా ఆందోళనలు చేస్తుంటే తాము ఇంట్లో కూర్చోలేమని ఆయన అన్నారు. తాము కాంగ్రెసులోనే ఉన్నామని, కాంగ్రెసు పార్టీని కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తాము కోరుతున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications