గాలి జనార్దన్ రెడ్డిపై చార్జిషీట్ వేసి తీరుతాం: సిబిఐ

అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సిబిఐ ప్రధాని నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. వారిని అరెస్టు చేసిన రోజునుంచి 90 రోజుల్లో వారిపై చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని సెప్టెంబర్ 4వ తేదీన సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. బళ్లారి నుంచి గాలి జనార్దన్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన చంచల్‌గుడా జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications