ప్రశాంతంగా బాన్సువాడ ఉప ఎన్నికలు: 77.62 శాతం ఓటింగ్

ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలలో కాంగ్రెసు, తెరాసలు మాత్రమే పోటీ చేశాయి. తెలుగుదేశం పార్టీ పోటీకు దూరం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడనే వాదనలు బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కుతుందా లేదా అనే ప్రశ్న అందరిలో ఉదయిస్తోంది. కాంగ్రెసు అభ్యర్థికి తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు సైతం మద్దతు తెలపక పోవడం విశేషం. కాగా ఈ ఎన్నికల్లో కోయగుట్ట తండాకు చెందిన గ్రామస్తులు తాము తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల్లో ఓటు వేసేది లేదని ఓటింగుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications