కెటిఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలకు బాసట, సిఎంపై ఫైర్

కిరణ్ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల ఆరోపణలపై హైకోర్టు స్పందించాలన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ నష్టపోతుంటే సిఎం ఉద్యమాన్ని ఎలా అణిచి వేయాలా అని కుట్ర చేస్తున్నారని ఎంపీ వివేక్ విమర్శించారు. ఒత్తిడి పెంచేందుకే తాము రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం నుండి, అధిష్టానం నుండి ఎలాంటి సంకేతాలు లేవన్నారు.
డబ్బులకు ఎవరు లొంగుతారో అందరికీ తెలుసునని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తెరాసను ఉద్దేశించి విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో చర్చించి సకల జనుల సమ్మెను విరమింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అవసరమైన పక్షంలో కాంగ్రెసు కోర్ కమిటీ ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యేలపై కెటిఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్సీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. జెఏసి పిలుపు మేరకు రైలు రోకోలో పాల్గొంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications