తెలంగాణపై కాలయాపన, ఉద్యమ అణచివేతకే మొగ్గు

తెలంగాణపై నిర్ణయం వెలువరించలేని స్థితిలో పడిన కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఉద్యమ అణచివేతపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేత స్వామిగౌడ్ రాజకీయ నేతలపై మండిపడుతూ సమ్మెపై భిన్న స్వరం వినిపిస్తుండడం, ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులతో చర్చలు జరపుతుండడం వంటి చర్యల ద్వారా సకల జనుల సమ్మె బలహీనపడుతుందనే భావనతో ఉన్నట్లు అర్థమవుతోంది.
మొత్తం తెలంగాణ ఉద్యమంలో మూడు రోజుల పాటు నిర్వహించే రైలో రోకో కార్యక్రమమే కీలకం కానుందని చెబుతున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో తెలంగాణ రాజకీయ జెఎసి రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిపై కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అర్థమవుతోంది. డిజిపి దినేష్ రెడ్డి ప్రకటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా, రైల్ రోకో సందర్భంగా ఏరియల్ నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఏరియల్ నిఘా ద్వారా ఎక్కడికక్కడ ఆందోళనకారులపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలకు దిగే అవకాశం ఉంది. ఏరియల్ నిఘాకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్‌ను కూడా పంపుతోంది.












Click it and Unblock the Notifications