జగన్, కెసిఆర్ కాంగ్రెసు గూటి పక్షులే: ఎంపీ లగడపాటి

Lagadapati Rajagopal
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇద్దరూ కాంగ్రెసు గూటి పక్షులే అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలను అణిచి వేసింది రజాకార్లు, దొరలేనని ఆయన అన్నారు. వారి అరాచకాలను కెసిఆర్‌కు చూపించాలనే ఉద్దేశ్యంతోనే తాము మా భూమి, ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క - సారక్క చిత్రాల సిడిలను ఆయనకు పంపించామని చెప్పారు. గతంలో రాష్ట్రాన్ని విభజించాలని ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే ఇప్పుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారన్నారు.

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్రను తాము అడ్డుకోమని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రలో 90 శాతం మంది, తెలంగాణలో 50 శాతం మంది సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతున్నారన్నారు. తన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయన్నారు. ఉద్యమానికి తలొగ్గి తెలంగాణ ప్రకటించే అవకాశాలు లేవన్నారు. తమ పార్టీ అధిష్టానం నెలాఖరులోగా నిర్ణయం ప్రకటిస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెతో ప్రజలు బాగా విసిగి పోయారన్నారు. సమ్మె ఇంకా ఎంతో కాలం కొనసాగదన్నారు. దేశంలో ఇదివరకు రాష్ట్రాలను విడదీయడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+