తెలంగాణ మంత్రులకు అమరుల శాపం: కెసిఆర్

ఇక తెలంగాణ మంత్రులు లక్ష్యంగానే తమ కార్యాచరణ ఉంటుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించారు. వారిపై ఒత్తిడి పెంచే విధంగా భవిష్యత్తు పోరాటాలను రూపొందించుకుంటామని చెప్పారు. నవంబర్ మొదటి వారంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నప్పుడు మంత్రి జానారెడ్డి సకల జనుల సమ్మెను విరమించుకోవాలని కోరటం ఇక్కడి ప్రజలకు, ఉద్యమానికి, తెలంగాణకు ద్రోహం చేయటమేనని ఆయన అన్నారు. "తెలంగాణ ప్రాంతంలో అరాచకం రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. రైలు రోకో సందర్భంగా పోలీసులు చట్టబద్ధంగా కాకుండా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల్లా వ్యవహరించారని, అకారణంగా కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టటం కన్నా అన్యాయం మరొకటి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications