హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవ్వాలో ఏడ్వాలో అర్థం కావట్లేదు: బాన్సువాడపై కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: బాన్సువాడ ఉప ఎన్నికలలో డిపాజిట్ దక్కడంపై కాంగ్రెసు సంతోషిస్తోందని వారిని చూస్తే తనకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తెరాస భవనంలో అన్నారు. బాన్సువాడ నుండి తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందడంపై తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారు. పోచారంను గెలిపించినందుకు తెరాస చీఫ్ కె చంద్రశేఖర రావు, ఎమ్మెల్యే కెటి రామారావు బాన్సువాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెసు సీనియర్ నాయకు కె కేశవరావు పోచారంను అభినందించారు. ఈ సందర్భంగా కెటిఆర్ తెరాస భవనంలో మాట్లాడారు. కాంగ్రెసు వారు కేవలం డిపాజిట్ దక్కినందుకే సంతోషించడం హాస్యాస్పదమని అన్నారు. ఎవరైనా ఎన్నికలలో పోటీ చేసేది గెలుపు కోసం కానీ కాంగ్రెసు మాత్రం డిపాజిట్ చూసి సంతోషిస్తోందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కై పోచారం మెజార్టీ భారీగా తగ్గించే కుట్ర పన్నాయన్నారు. ఎన్నికలు మేం ఏకపక్షమనే ఊహించామన్నారు. ఈ విజయం ద్వారా తెరాస పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని మరోసారి తేటతెల్లమైందన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెసుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఆదివారం మంత్రి దానం నాగేందర్ అనుచరులు తెరాస కార్యకర్తలు దాడి చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో టిడిపి పూర్తిగా ఉనికి కోల్పోయిందన్నారు. డిపాజిట్ కూడా రాదనే టిడిపి పోటీ చేయలేదన్నారు. టిడిపి, కాంగ్రెసు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

కాంగ్రెసు కేవలం డిపాజిట్ దక్కినందుకు సంతోషిస్తే అది సరికాదని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కె కేశవరావు అన్నారు. 2009 నాటి తెలంగాణ ప్రకటకు తమ పార్టీ కట్టుబడక పోవడం వల్లనే తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయారన్నారు. మంత్రి దానం దాడి సరికాదన్నారు.

English summary
TRS MLA KT Rama Rao satired on Bansuwada bypoll. He blamed TDP and Congress for less majority to Pocharam Srinivas Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X