లక్ష్మీ పార్వతి అండతో విజయమ్మ పిల్: నన్నపనేని

చంద్రబాబు ఆస్తులపై వైయస్ విజయమ్మ హైకోర్టు వెళ్లడాన్ని తాము తప్పు పట్టడం లేదన్నారు. కోర్టుకు వెళ్లే హక్కు అందరికీ ఉందన్నారు. అయితే జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు జరుగుతున్న సమయంలో కేసు వేయడాన్ని కుట్రగా అభివర్ణించారు. జగన్ పైన జరుగుతున్న సిబిఐ దర్యాఫ్తు నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి వారు కోర్టుకు వెళ్లారన్నారు. బాబు తప్పు చేశారని భావిస్తే దివంగత వైయస్ అధికారంలో ఉన్న ఐదున్నరేళ్లు ఏం చేశారని ఆయన విజయమ్మను ప్రశ్నించారు. వైయస్ అసమర్థుడు, దద్దమ్మ అని ఆమె ఇప్పుడు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. గతంలో వైయస్ కూడా లక్ష్మీ పార్వతిని పట్టుకొని బాబు ఆస్తులపై పిటిషన్లు వేసి ఉపసంహరించుకున్నారో ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. తాము ఇందుకు బయపడటం లేదన్నారు.
గతంలో వైయస్ బాబు ఆస్తులపై 32 పిటిషన్లు వేశారని వాటిని నిరూపించలేక వెవక్కి తీసుకున్నారని ఎమ్మెల్యేలు లింగారెడ్డి, పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు సచ్ఛీలురుగా బయట పడతారని చెప్పారు. బాబు అక్రమాలకు పాల్పడితే వైయస్ తన కేసులను ఉపసంహరించుకునే వారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications