పోచారం ఘన విజయం, పరువు దక్కించుకున్న కాంగ్రెస్

Pocharam Srinivas Reddy
నిజామాబాద్: బాన్సువాడ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్‌పై 49,889 ఓట్ల భారీ భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం రౌండ్లు పూర్తయ్యే సరికి పోచారం శ్రీనివాస్ రెడ్డి 83.245 ఓట్లు, శ్రీనివాస్ గౌడ్ 33,356 ఓట్లు సాధించారు. పోచారం గెలుపుతో నియోజకవర్గ తెరాస పార్టీ ఆనందంలో మునిగి పోయింది. మొదటి రౌండు నుండి ఏడో రౌండు వరకు కాంగ్రెసు అభ్యర్థి పోచారం పొందిన ఓట్లలో సగం పొందుతూ వచ్చారు. ఆ తర్వాత వెనుక పడ్డారు. కాగా ఈ నెల 13వ తారీఖున జిల్లాలోని బాన్సువాడ ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయమే ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ హాలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా ఆంక్షలు విధించారు.

లక్ష ఓట్లు ఆధిక్యంతో గెలుస్తామని తెరాస ధీమాతో ఉన్నప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు. కాంగ్రెసుకు డిపాజిట్ కూడా దక్కదని తెరాస వర్గాలు భావించాయి. మరోవైపు కాంగ్రెసు డిపాజిట్ వస్తే చాలని భావించింది. కానీ శ్రీనివాస్ గౌడ్ డిపాజిట్ దక్కించుకోవడంతో కాంగ్రెసులోనూ ఉత్సాహం కనిపించింది. సకల జనుల సమ్మె తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి లక్ష మెజార్టీ వస్తుందని తెరాస భావించింది. బాన్సువాడలో 1,59,673 ఓట్లకు గాను 1,22,872ఓట్లు పోలయ్యాయి. 76.95 శాతం పోలింగ్ నమోదయింది. గత పోలింగ్ కంటే ఇది 2.05 శాతం తక్కువ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+