వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిపిఎ ద్వారా ఆస్తి అమ్మకం చట్టవిరుద్ధం, ధరలపై ప్రభావం

By Pratap
|
Google Oneindia TeluguNews

GPA
న్యూఢిల్లీ: జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జిపిఎ) ద్వారా ఆస్తుల అమ్మకం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రభావం ధరలపై పడే అవకాశం ఉంది. తన ఆస్తిపై జిపిఎ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి హక్కు కల్పిస్తాడు. జిపిఎ తీసుకున్న వ్యక్తి ఆ ఆస్తిని అమ్మడానికి కూడా హక్కును పొందుతాడు. జిపిఎ ద్వారా యజమాని ఆస్తిన కొనుగోలుదారుడి స్వాధీనంలోకి వస్తుందని, ఓనర్‌షిప్ మాత్రం దక్కగని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, రిజిష్టర్డ్ డీడ్ ద్వారా మాత్రమే ఆస్తి విక్రయం జరిగినట్లు పరిగణించాలని, జిపిఎ ద్వారా పరిగణించడానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. డీడ్‌పై స్టాంపు వేసి స్థానిక మెజిస్ట్రేట్ ద్వారా రిజిష్టర్ అయినప్పుడు మాత్రమే ఆస్తి బదిలీ చట్టబద్ధమవుతుందని తెలిపింది.

కన్వేయన్స్ డీడ్ ద్వారా మాత్రమే స్థిరాస్తి బదిలీ అవుతుందని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయం గతంలో జరిగిన లావాదేవీలకే కాకుండా భవిష్యత్తు లావాదేవీలకు వర్తిస్తుంది. అయితే ఈ విషయంలో కోర్టు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఓ వ్యక్తి తన భార్యకు, కుమారుడికి, కూతురుకు, సోదరుడికి సోదరికి, ఇతర బంధువులకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వవచ్చు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల పన్ను ఎగవేతను అరికట్టడానికి, రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నల్ల ధనం ప్రవాహాన్ని ఆపడానికి వీలువుతుంది. కోర్టు నిర్ణయం కొనుగోలుదారుడికి రక్షణ కల్పిస్తుంది. అయితే, సెకండరీ లావాదేవీలపై, రీసేల్ మార్కెట్లపైపై ప్రభావం చూపుతుంది.

English summary
The verdict of Supreme Court against the property sale through a general power of attorney (GPA) may affect the prices of properties issued via GPA as the apex court had declared this title as illegal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X