ఇక కాంగ్రెసు టార్గెట్‌గా ఉద్యమం: తెలంగాణ జెఎసి

ఇక తెలంగాణ మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ రావాలంటే కాంగ్రెసు ఖతం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకార్యకర్తలు గోవింద్, ప్రకాష్‌లను వేధిస్తున్నారని కోదండరామ్ ఆరోపించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, లగడపాటి రాజగోపాల్‌లతో తెలంగాణ మంత్రులు చర్చలు జరపడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం చేపట్టిన దీక్షను ఆరోగ్య కారణాల రీత్యా విరమించుకోవాలని జెఎసి సిపిఐ శాసనసభ్యుడు కూనంనేనికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని జెఎసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications