జగన్‌పై మరోసారి దండెత్తిన కాంగ్రెసు నేత విహెచ్

కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే ప్రజలు నమ్మడం వల్లనే నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్‌కున డిపాజిట్ దక్కిందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను తిడితే ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. కొంత మంది పోలీసుల అత్యుత్సాహం వల్లనే రైల్ రోకో సందర్భంగా పార్లమెంటు సభ్యుల అరెస్టు జరిగిందని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ వస్తుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications