సహోద్యోగినిపై నెట్‌లో మహిళా సిఇవో అసభ్య వ్యాఖ్యలు

వ్యాఖ్యలను ఎక్కడి నుంచి పోస్టు చేస్తున్నారనే విషయాన్ని ఐపి అడ్రస్ ద్వారా సైబర్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ సెల్ కనిపెట్టింది. అవివాహిత అయిన బాధితురాలు తనపై పోస్టవుతున్న వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్ పోస్టుల వల్ల బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి ఎప్పటిలాగా పనిచేయలేకపోయింది. ప్రతి ఒక్కరూ ఆ వ్యాఖ్యల గురించే అడగడం ప్రారంభించారని బాధితురాలు తెలిపింది.
అసభ్య వ్యాఖ్యలను పోస్టు చేసిన సిఇవోను పోలీసులు పట్టుకున్నారు. దీంతో సిఇవో పోలీసు స్టేషన్‌లో బోరున ఏడ్చేసింది. తన ఎదుటే ఉన్న బాధితురాలి కళ్లలోకి సూటిగా చూడలేకపోయింది. బాధితురాలికి త్వరగతి పదోన్నతులు రావడంతో తాను ఈర్ష్యపడ్డానని, అందువల్లనే ఆ వ్యాఖ్యలు పోస్టు చేశానని రాతుపూర్వకంగా కోరిన క్షమాపణ పత్రంలో సిఇవో తెలిపింది.












Click it and Unblock the Notifications