గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీపై మళ్లీ వైయస్ జగన్ వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అదే రకమైన దాడికి ఒడిగట్టారు. గుంటూరు జిల్లాలో ఆదివారం ఆయన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతోనే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు. చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ సోనియా గాంధీపై విమర్శలకు దిగారు. సోనియా గాంధీపై జగన్ విమర్శలు చేయడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్య ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డి పరువును బజారుకీడ్చేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కుళ్లు, కుతంత్రాలతో రెండు పార్టీలు కలిసి వైయస్సార్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకున్నాయని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న నాయకులు నీచమైన రాజకీయాలకు దిగుతున్నారని ఆయన అన్నారు. వైయస్సార్‌పై అభిమానంతో తరలి వచ్చిన ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని ఆయన అన్నారు.

English summary
YSR Congress president YS Jagan again made comment against Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X