బాబు ఆస్తులపై హైకోర్టుకు వైయస్ విజయమ్మ

YS Vijayamma-Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అటాక్‌కు దిగినట్లుగా కనిపిస్తోంది. ఆయన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు అయిన వైయస్ విజయమ్మ సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు అక్రమ ఆస్తులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2424 పేజీల పిటిషన్ ఆమె తన లాయరు ద్వారా కోర్టులో దాఖలు చేశారు. అందులో 110 పేజీలు ఇండెక్స్ పేజీలు. తన పిటిషన్‌లో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలను ఆమె ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆమె అందులో ఆమె ఆరోపించారు.

ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, వాటి విలువ ఎంత తదితర అంశాలను అందులో పొందుపర్చారు. చంద్రబాబు సిఎం కాక ముందు ఆస్తులను అయ్యాక ఆయనకు గల ఆస్తులను అందులో వివరించారు. తన ఆస్తులపై ఆయన చేసిన ప్రకటన తప్పని ఆమె ఆరోపించారు. అందులో ఆమె బాబు తనయుడు లోకేష్ కుమారు, సినీ హీరో మురళీ మోహన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు పేర్లను పేర్కొన్నారు. అందులో 20 మందిని ప్రతివాదులుగా చేర్చారు. టిడిపి హయాంలో జరిగిన అక్రమాలన్ని చంద్రబాబు మూలంగా జరిగనవే అని ఆమె అందులో ఆరోపించారు. జగన్ పై సిబిఐ విచారణ జరుగుతున్న సమయంలో చంద్రబాబుపై వైయస్ విజయమ్మ హైకోర్టు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+