తెలంగాణపై జాప్యం వద్దు, బిల్లు పెట్టాలి: అద్వానీ

అద్వానీ రెండు రోజలు పాటు రాష్ట్రంలో రథయాత్ర చేస్తారు. అది కూడా తెలంగాణ ప్రాంతంలోనే కావడం విశేషం. ఆదిలాబాద్ ఇచ్చోడ, నిర్మల్, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ దాకా ఆయన యాత్ర సాగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఉంటే వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు అప్పుడు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు నానుస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై యుపిఎ మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో ప్రజల్లో ఆవేదన ఉందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాము సాకారం చేస్తామని ఆయన అన్నారు. భారత్‌లో అవినీతిని అంతమొందించాలని, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని దేశంలోకి తీసుకురావాలని, ఆ నల్లధనంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications