అన్నా టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్‌పై దాడి

కేజ్రీవాల్ ఆ వ్యక్తిని క్షమించాడని, అతనిపై కేసు నమోదు చేయవద్దని చెప్పామని టీమ్ అన్నా కోర్ కమిటీ సభ్యుడు సంజయ్ సింగ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. అన్నా టీమ్ సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడిని మరిచిపోక ముందే కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. కేజ్రీవాల్‌పై దాడిని ప్రస్తావిస్తూ తాము బెదిరిపోవడం లేదని, అవినీతిని అంతం చేయడానికి తాము బుల్లెట్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నా హజారే అన్నారు. అవినీతిపై ప్రజలను చైతన్యపరచడానికి తాను లక్నోలో పర్యటించదలుచుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications