కాంగ్రెసు అభ్యర్థి వ్యాఖ్యలు నిజం: సిఎం కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: బాన్సువాడ ఫలితాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమన్న తమ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు నూరు శాతం వాస్తవమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఉప ఎన్నికలలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు ద్వారా ఏ విధంగా చూసినా నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లనే కాంగ్రెసు ఓటు బ్యాంకు స్థిరంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు నేతలు కిరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస అభ్యర్థికి లక్షకు పైగా మెజార్టీతో పాటు ప్రత్యర్థులెవరికీ డిపాజిట్లు కూడా దక్కవన్న వాదనల్లో పసలేదని తెలిపోయిందన్నారు.

ఏదో ఒక పార్టీతో కుమ్మక్కవడం తెరాసకు ఆనవాయితీయే తప్ప కాంగ్రెస్‌ది కాదంటూ సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తదితరుల వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గా లు వారిని నమ్మలేదని, అక్కడి సెటిలర్స్‌ను కూడా టీఆర్ఎస్ భయపెట్టిందని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుపేదల బాధలను పట్టించుకోని తెరాస స్వార్థం కోసం వివిధ వర్గాలను మభ్యపెట్టి సమ్మెలు, బంద్‌లు, ఆందోళనలు చేయిస్తున్న విధానాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+