మంత్రి జానారెడ్డి దుమ్ము దులిపిన తెలంగాణ ఎంపీలు

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ నాయకులు మండిపడ్డారు. వారిద్దరి తీరును సమావేశంలో వారు తప్పు పట్టారు. మంత్రి దానం నాగేందర్‌పై తెలంగాణవాదులు కోడిగుడ్లు విసిరితే ఖండించిన బొత్స సత్యనారాయణ తమను అరెస్టు చేస్తే ఎందుకు మాట్లాడలేదని వారు అడిగారు. రైలో రోకోలో పాల్గొంటే తప్పు పడుతున్న కాంగ్రెసు నాయకులు సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో సమావేశమైతే ఎందుకు వ్యతిరేకించడం లేదని అడిగారు. తెలంగాణ నేతల పట్ల కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వివక్ష ప్రదర్శిస్తున్నారని వారు విమర్శించారు. కెకె నివాసంలో స్టీరింగ్ కమిటీ సమావేశం వేడివేడిగా సాగింది.












Click it and Unblock the Notifications