కాంగ్రెసు నుంచి బయటకు వస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ సాధన కోసం తమ స్టీరింగ్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణపై మంత్రి జానారెడ్డి సీరియస్‌గా ఉన్నారని, తనకు పదవి ముఖ్యం కాదని సమావేశంలో చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణకు చెందిన మంత్రులు రాజీనామా చేయాలని సమావేశంలో పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణవాదాన్ని అందరూ గట్టిగా వినిపించాల్సిందేనని ఆయన అన్నారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాలను బహిష్కరిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications