కాంగ్రెసు డైరెక్షన్‌లో జగన్: బాబు కేసుపై యనమల

చంద్రబాబు నాయుడు ఆస్తులపై వైయస్ విజయమ్మ కేసు వేయడం వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి మంగళవారం వరంగల్ జిల్లాలో అన్నారు. జగన్ వెనుకుండి విజయమ్మను నడిపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించినప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. విజయమ్మ కేవలం బొమ్మ మాత్రమేనన్నారు. తన కొడుకును కాపాడుకునేందుకు ఆమె బాబుపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు తగవన్నారు. త్వరలో జగన్ ఊచలు లెక్కపెట్టే రోజు వస్తుందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాబుపై ఎన్నో కేసులు వేసి నిరూపించ లేకపోయారన్నారు.












Click it and Unblock the Notifications