హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరెటో చెప్పండి: చంద్రబాబుకు కెసిఆర్ కూతురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: పోలవరం, తెలంగాణ అంశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి పక్షమో మొదట చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. పోలవరం అడ్డుకోవడానికి తెరాస కట్టుబడి ఉందన్నారు. ఐదేళ్లుగా పోలవరాన్ని తెరాస అడ్డుకుంటుందని కానీ ఇప్పుడు టిడిపి నేతలు మాపైనే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణ విషయంలో తటస్థమని చేతులెత్తేసిన బాబు పోలవరం విషయంలో ఆంధ్రా భూస్వాముల వైపు ఉంటారా లేక ముంపుకు గురయ్యే గిరిజనుల వైపు ఉంటారో చెప్పాలన్నారు. సిఎం కిరణ్ కూడా దీనిపై సమాధానమివ్వాలన్నారు.

పోలవరం కేసు సుప్రీం కోర్టులో పెండింగులో ఉండగా ప్రాజెక్టు కడితే సిఎం కంటెంట్ ఎదుర్కొనవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలవరం, దుమ్ముగూడ ఏ ప్రాజెక్టులు తాము కట్టనివ్వమన్నారు. త్వరలో అన్ని టెండర్లు క్యాన్సిల్ అవుతాయని అభిప్రాయపడ్డారు. పోలవరం డిజైన్ మారిస్తే అభ్యంతరాలు ఉండక పోవచ్చునన్నారు. పోలవరం కోసం టిడిపి నేతలే టెండర్లు వేసి ఇప్పుడు తెరాసపై విమర్శలు చేయడం సరికాదన్నారు. టిడిపి 2007లో పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందిందని విమర్శించారు.

English summary
TRS chief K Chandrasekhar Rao, Telangana Jagriti president Kavitha questioned TDP chief Nara Chandrababu Naidu and CM Kiran Kumar Reddy about Polavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X