వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చల్లారని పోలవరం మంట, అక్రమాలపై హైకోర్టులో పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayashanti and Polavaram Project
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పోలవరం టెండర్ల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టారన్న వ్యాఖ్యలు శుక్రవారం మరింత ఘాటెక్కాయి. కెసిఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే టిడిపి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. వారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తదితరులు టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు తెరాస అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే పోలవరం నిలిపి వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. తెలంగాణ తెదేపా నేతలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. పోలవరంపై చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలన్నారు. తెదేపా వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి ఒక టివి, పత్రిక పెట్టుకుంటే సీమాంధ్ర బాబు తొత్తులు వాటిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

సుప్రీం ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఎలా టెండర్లు వేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణపై తెలంగాణ తెదేపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే, చీమూ నెత్తురూ ఉంటే తమతో కలిసి రావాలి కానీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ కోసం పత్రిక, ఛానల్ రాకుంటే ఉద్యమానికి ఇంత ప్రచారం వచ్చేదే కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన పేపర్లను ప్రజలకు చూపించలేని దద్దమ్మలన్నారు. అసలు టిడిపి పోలవరానికి అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని ప్రశ్నించారు. తెరాస తరఫున టెండర్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి లేఖ రాస్తామని చెప్పారు. మరికొందరు నేతలు మరో అడుగు ముందుకేసి పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చంద్రబాబుపై వేసిన పిటిషన్‌పై నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తకుముంద టిడిపి నేతలు దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ తమ వద్ద పోలవరంలో, నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తి పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. తాము ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌ను కలిసి పోలవరం టెండర్లలో పూర్తిగా అక్రమాలు జరిగాయని వాటిని నిలుపుదల చేయాలని కోరారు. టెండర్ల దస్త్రం నిబంధనలకు విరుద్ధంగా ప్ర్రైవేటు సంస్థలకు ఎలా ఖరారు చేస్తారని ఆయన గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. టెండర్ల అంశంపై ముఖ్యమంత్రితో పాటు కార్యదర్శులందరి పైనా పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. లేకపోతే గిరిజనులు నష్ట పోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ సిజిజిసి, సోమా కంపెనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. టెండర్లలో అక్రమాలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కోరాయి. ఎల్ 2గా ఉన్న తమను కాకుండా ఎస్ఇడబ్ల్యుకు కాంట్రాక్టు కేటాయించడాన్ని సోమా కంపెనీ పిటిషన్‌లో పేర్కోంది.

English summary
TDP MLA Revanth Reddy Polavaram - Sakala Janula Strike alegations created very serious. TRS leaders lashes out at TTDP leaders. Medak MP Vijayasanthi condemned TTDP leaders comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X