అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోదండరామ్, స్వామిగౌడ్‌పై చర్యలుండవు: శైలజానాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanth
అనంతపురం: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవచ్చునని మంత్రి శైలజానాథ్ శుక్రవారం అనంతపురం జిల్లాలో అభిప్రాయపడ్డారు. వారు వెంటనే సమ్మె విరమణకు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ జెఏసి తెలంగాణ రాష్ట్ర సమితి ముసుగులో పని చేస్తోందని ఆరోపించారు. అందుకే తెలంగాణ ఉద్యమం అంటూ తమ టార్గెట్ కాంగ్రెసు పార్టీ మంత్రులు, శాసనసభ్యులే అంటున్నారని ఆరోపించారు. అది సరి కాదన్నారు.

ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణలో సకల జనుల సమ్మెను వెంటనే విరమించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అధిష్టాం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఉద్యమంలో పాల్గొన వద్దని అధిష్టానం వారికి సూచించినా పాల్గొనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలంగాణ కాంగ్రెసు నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు.

English summary
Minister Sailajanath said today that government will not take action JAC chairman Kodandaram and TNGO leader Swamy Goud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X