మూడో రోజూ కొనసాగుతున్న జగన్ ఇంటి అంచనా

జగన్ భవనం ఐదు వేల గజాలతో రెండు భవనాలుగా ఉంటుంది. దీని అంచనా వేయడానికి వచ్చే శుక్రవారం వరకు సిబిఐకి అనుమతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల తనిఖీలో కేవలం ఒకే భవనం అంచనా పూర్తయినట్లుగా తెలుస్తోంది. జగన్ ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎంతెంత విస్తీర్ణం ఉన్నాయి, వినియోగించిన గ్రానైట్స్ లేదా మార్బుల్స్ విలువ ఎంత తదితర అంశాలని పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో గదిలో ఉన్న సామాగ్రి విలువు కూడా లెక్కిస్తున్నారు. అన్నింటినీ కూడా విడీయో చిత్రీకరణ చేస్తున్నారు. తనిఖీలు శనివారం పూర్తయ్యే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications