కెసిఆర్‌తో మేము, ఎమ్మెల్యేలూ ఆమరణ దీక్ష: హరీష్

కాగా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సకల జనుల సమ్మె విరమించాలన్న కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు స్వామి గౌడ్, దేవి ప్రసాద్ తదితరులు స్పందించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆజాద్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నామని కానీ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా సమ్మె విరమించేది లేదన్నారు. సకల జనుల సమ్మె ద్వారా కేంద్రానికి తెలంగాణ ఆకాంక్ష తెలియజేశామన్నారు. తెలంగాణపై నిర్ధిష్ట సమయం ప్రకటించాలన్నారు. అయితే ఆజాద్ విజ్ఞప్తిపై సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications