సిఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్సకు అధిష్టానం మెచ్చుకోలు

వారు ఢిల్లీ వెళ్లి వచ్చాక సమ్మె విరమణ చర్యలకు పూనుకున్నారు. వివిధ ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమ్మె ప్రభావాన్ని క్రమంగా తగ్గించారు. రవాణా శాఖ మంత్రి అయిన బొత్స తన శాఖ ఉద్యోగుల సమ్మె విరమణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆర్టీసి సమ్మె నుండి ప్రారంభమైన సమ్మె విరమణ క్రమంగా అన్ని శాఖలకు విస్తరిస్తోంది. అదే సమయంలో బాన్సువాడలో డిపాజిట్ కూడా దక్కదనుకున్న కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి మంచి ఓట్లు వచ్చాయి. పిసిసి చీఫ్ బొత్స, తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు బాన్సువాడలో అభ్యర్థిని పోటీలో పెట్టవద్దని సూచించినప్పటికీ సిఎం కిరణ్ మాత్రం ససేమీరా అన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలలో ఓడినప్పటికీ ఫలితం కాంగ్రెసుకే సానుకూలంగా ఉండటంతో అధిష్టానం సిఎం కిరణ్ పట్ల ఈసారి సంతృప్తి కనబర్చినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications