వైయస్ జగన్ సాక్షి కార్యాలయంపై సిబిఐ దృష్టి?

జగన్ ఇంటిని పరిశీలించిన అధికారులు మొత్తం విలువ ఖచ్చితంగా ఇప్పుడే చెప్పనప్పటికీ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం. అయితే జగన్ ప్రతినిధులు మాత్రం సిబిఐ ముందు లోటస్ పాండ్ విలువ చాలా తక్కువగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ తర్వాత సాక్షి, పులివెందులలోని ఇళ్లు, బెంగళూరు ఆస్తులపై దృష్టి సారించనున్నట్లు కనిపిస్తోంది. జగన్ ఇంటి తర్వాత హైదరాబాదులోనే ఉన్న సాక్షిని పరిశీలించి పులివెందుల, బెంగళూరు ఆస్తులు పరిశీలించే అవకాశాలున్నాయి. ఇప్పటికే బెంగళూరులో జగన్ ఇంటి విలువ సుమారు రూ.ముప్పై కోట్ల వరకు ఉండవచ్చని సిబిఐ అధికారులకు చెప్పినట్లు సమాచారం. అయితే అది అంతకు ఎక్కువగానే ఉండవచ్చుననే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక ఇంటి నిర్మాణం కూడా నిబంధనలకు విరుద్దంగా, నివాస ధృవీకరణ పత్రం లేకుండా ఉండటంతో మిగిలిన ఆస్తుల పైనా ఆ కోణం నుండి అధికారులు దృష్టి సారిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications