బాలనాగి రెడ్డి బెదిరించడం సరికాదు: కెసిఆర్ కూతురు

Kalvakuntla Kavitha
మహబూబ్ నగర్/కర్నూలు: తాము న్యాయమైన నీటి వాటా కోసం డిమాండ్ చేస్తుంటే కర్నూలు జిల్లా శాసనసభ్యుడు బాలనాగి రెడ్డి బెదిరింపులకు పాల్పడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం అన్నారు. ఆమె ఆర్డీఎస్ పరిశీలించేందుకు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉండటంతో పోలీసులు అమెను తూముల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము న్యాయమైన వాటా అడుగుతున్నామని బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. రైతులు వేసిన పంటలు ఎండిపోతుంటే వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆర్డీఎస్‌ను బ్యారేజిలుగా మార్చి నీటిని ఉపయోగించుకుంటే బావుంటుందన్నారు.

కాగా అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్డీఎస్ వద్ద మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు రైతులు ఇసుక మూటలు వేసి తమ ప్రాంతానికి నీళ్లు మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఇసుక బస్తాలను తీసుకు వచ్చి ఆర్డీఎస్ వద్ద వేశారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల రైతులు పెద్ద ఎత్తున ఆర్డీఎస్ వద్దకు తరలి వచ్చారు. ఇసుక మూటలు వేసి నీటిని అడ్డుకుంటే తమ ప్రాంతాలకు నీరు అందకుండా పోతుందని తద్వారా పంటలు ఎండిపోయి తాము తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని కర్నూలు రైతులు, తూములు పగుల గొట్టి నీరు వాడుకుంటున్నారని మహబూబ్ నగర్ రైతులు ఆరోపణలు చేసుకున్నారు.

ఇరు ప్రాంతాల రైతులు అక్కడకు రావడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన భారీగా పోలీసులను మోహరించారు. కాగా సంఘటనా స్థలానికి మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగి రెడ్డి వచ్చారు. ఆర్డీఎస్ వివాదంపై మంత్రి డికె అరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని ఇరుప్రాంతాల వారు సమానంగా పంచుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+