'జగన్' సవాల్ స్వీకరించిన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ

నిజం నిప్పులాంటిది, అది ఎప్పుడైనా బయట పడుతుందన్నారు. జగన్ వర్గం అక్రమాలు బయటపెట్టిన మీడియాపై దాడి చేయడం సరికాదన్నారు. 2004కు ముందు ఇల్లు అమ్ముకునే స్థితి నుండి ఇంద్ర భవనాలు కట్టే స్థితికి ఎలా చేరుకున్నారో చెప్పాలన్నారు. జగన్ శిబిరం చీఫ్ ట్రిక్కులకు భయపడేది లేదన్నారు. సిబిఐ దర్యాఫ్తులో నిగ్గు తేలుతున్న నిజాల మాటేమిటని ప్రశ్నించారు. జగన్‌పై మా కథనాలపై చర్చకు మేం రెడీ మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు.
కాగా జగన్ ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని ప్రసారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు, టివి9లపై జగన్ వర్గం గట్టు, శోభా నాగిరెడ్డి విరుచుకు పడిన విషయం తెలిసిందే. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వారు వారి ఛానళ్లలో ప్రసారం చేసిన వాటిని నిరూపించడానికి ఇరవై నాలుగు గంటలలో స్పందించాలని డెడ్ లైన్ విధించారు. అయితే శనివారం వరకు స్పందన రాకపోవడంతో గట్టు మాట్లాడుతూ తాము విధించిన డెడ్ లైన్ పూర్తయిందని అయితే తమ సవాల్‌కు వారి నుండి స్పందన రాక పోవడంతో వారి ప్రసారాలు తప్పుడు కథనాలుగా భావిస్తున్నామని అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
