'చిరంజీవి'కి ఈసారి దక్కేనా? రేసులో డి శ్రీనివాస్, కంతేటి

సిఎం కిరణ్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్టానాన్ని అడుగుతున్నప్పటికీ పరిస్థితుల దృష్ట్యా ససేమీరా అంటున్నారు. సిఎం సైతం మంత్రివర్గంలో మార్పుల ద్వారా తనకు అనుకూలమైన వారిని తీసుకుందామనే భావనలో ఉన్నారు. కానీ అధిష్టానం నుండి అనుమతి రావడం లేదు. దీంతో ఎన్నాళ్ల నుండో నిరీక్షిస్తున్న చిరు వర్గం నేతలకు అవకాశం రావడం లేదు. ఇక చిరంజీవికి కూడా ఏఐసిసిలో చోటు దక్కుతుందని, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు అప్పట్లో వినిపించాయి. కానీ చిరంజీవికి ఏదీ దక్కలేదు. దీంతో చిరంజీవి వర్గంలో అనాసక్తత ఏర్పడింది. అయితే రోశయ్య స్థానం ఖాళీ కావడంతో మళ్లీ పలువురు ముఖ్యనేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఓ నేత పిసిసి చీఫ్ బొత్సను కలిసి తనకు ఆ స్థానం కేటాయించాలని కూడా కోరారు. కానీ వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఇటీవల బొత్స చిరును కలిసి ఎమ్మెల్సీ స్థానంపై చర్చించిన విషయం తెలిసిందే.
కాగా ఎమ్మెల్సీ స్థానం కోసం మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో డిఎస్‌కు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రోశయ్య ఆంధ్రా ప్రాంతం వ్యక్తి కాబట్టి ఆంధ్రా ప్రాంతం వారికి ఇవ్వాలని, వైశ్య నేత కాబట్టి ఆ వర్గానికే ఇవ్వాలనే విజ్ఞప్తులు వచ్చినప్పటికీ అవన్నీ తోసిరాజనే డిఎస్ లేదా కంతేటికి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications