Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ సకల జనుల సమ్మె విరమణ, చర్చలు సఫలం

Telangana Map
హైదరాబాద్: నలబై రెండు రోజుల తెలంగాణ సకల జనుల సమ్మెకు తెర పడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సోమవారం రాత్రి సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో 9 డిమాండ్లపై ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే, సమ్మె కాలానికి వేతనాలను అడ్వాన్స్‌గా చెల్లించడానికి ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. రేపు మంగళవారం నుంచి తెలంగాణ ఉద్యోగులు తమ విధులకు హాజరు కానున్నారు. నో వర్కు నో పేను నిర్దేశించే 177 జీవో అమలుపై మినహాయింపు కోరుతూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనుంది. సమ్మె విరమణ ఒప్పందం పత్రంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. 42 రోజుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు కాలంగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

అంతకు ముందు పరిణామాలు ఇలా సాగాయి - సమ్మె విరమణకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులతో డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. తెలంగాణ ఉద్యోగులు పెడుతున్న కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆప్షనల్ సెలవుల జీతభత్యాలపై ఇరు పక్షాల మధ్య పీఠముడి పడినట్లు తెలుస్తోంది. తాము సమ్మె చేసిన 42 రోజులను విధులు నిర్వహించినట్లుగా పరిగణించి జీతభత్యాలు చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు ఎదురు కావచ్చుననే ప్రభుత్వ ఉద్దేశంతో చర్చలు ముందుకు సాగలేదు. నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే, అందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు సిద్ధంగా లేరు.

అలాగే, ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై కూడా ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదరడం లేదు. కేసులను ఎత్తేయాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేస్తుండగా, దశలవారీగా ఎత్తేస్తామని ప్రభుత్వం అంటోంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతల డిమాండ్లపై డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సితోనూ, ఆర్థిక శాఖ కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం దిగి రావడంతో సమస్య పరిష్కారమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+