ఇక టిడిపి అధినేత చంద్రబాబు రైతు పోరు యాత్ర

కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు సగానికి పైగా ఎండిపోయాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. తాము పోరుబాటు చేపడుతామని ఆయన అన్నారు. వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం స్వామినాథన్ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నవంబర్ 2 నుంచి 22 జిల్లాల్లో రైతు పోరు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. 37 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆయన అన్నారు. సాగునీటి సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో తాగు నీరు, సాగునీరు, వర్షాభావ పరిస్థితులపై ఆయన సమీక్షించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని కరవు మండలాల జాబితాను ప్రకటిస్తామని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications