కెసిఆర్‌ను వెంటాడుతాం, ఆస్తులు చెప్పాల్సిందే: మోత్కుపల్లి

కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులకు 55 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని మోత్కుపల్లి అన్నారు. ఆ ఆస్తులను పేద ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారసు. రెండు సార్లు రాజీనామా చేసిన తమను తెలంగాణ ద్రోహులని అంటున్నారని, అసలు తెలంగాణ ద్రోహి కెసిఆర్ అని ఆయన అన్నారు. కెసిఆర్ రాజకీయ ప్రయోజనం కోసమే పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాదని ఆయన అన్నారు. రాజకీయ ఎత్తుగడలతో వ్యవహరిస్తున్న కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని ఆయన అన్నారు. పోలవరం టెండర్ దక్కించుకుని కెసిఆర్ సమ్మెను విరమింపజేసి తెలంగాణ ఉద్యోగులను ఫూల్స్ చేశారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు రావాలంటే చంద్రబాబు రావాలని తెరాస నాయకులు షరతు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ సాధనలో తెరాస శిఖండిలా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస అమ్ముడుపోయే పార్టీ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications