అందులో కుట్ర జరిగి ఉండొచ్చు: మంత్రి శంకరరావు

ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త తనపై సుమోటోగా కేసు స్వీకరించడం పట్ల ఆయన ఆవేదన చెందారు. తనపై సుమోటోగా కేసు స్వీకరించడం బాధాకరమన్నారు. కంటోన్మెంటు ఎమ్మార్వో సరిగ్గా పని చేయడం లేదని తనకు ప్రజల నుండి ఫిర్యాదు వస్తేనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశానన్నారు. కాగా అంతకుముందు తిరుమలగిరి తహశీల్దారును బదలీ చేయాలంటూ మంత్రి శంకరరావు పైఅధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త స్పందించి దానిని సుమోటోగా స్వీకరించింది. వివరణ ఇవ్వాలని మంత్రిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications