రాజకీయాల్లో వ్యభిచారం చంద్రబాబుదే: తెరాస

Nayani Narasimha Reddy
హైదరాబాద్: తమ పార్టీ నేత కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై, ఆ పార్టీ తెలంగాణ నేతలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు నాయని నర్సింహారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయాలను వ్యభిచారంగా, వ్యాపారంగా మార్చింది చంద్రబాబునాయుడేనని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సైకిల్ గుర్తు కోసం వ్యభిచారం చేయించింది చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. ఎమ్మార్ వ్యవహారంలో తన అక్రమాలు బయటపడతాయని కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కుమ్మక్కయి చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయ్యారని, అందుకే కాంగ్రెసును విమర్శించకుండా కెసిఆర్‌ను టార్గెట్ చేసుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పప్పెట్ షో ఆడిస్తుంటే ఓ జోకర్, ఓ బ్రోకర్, ఓ పిట్టల దొర ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యభిచారానికి పాల్పడింది చంద్రబాబేనని ఆయన అన్నారు.

చంద్రబాబువన్నీ దొంగ యాత్రలేనని, రైతులను అడ్డుపెట్టుకుని తెలంగాణలో అడుగు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, తెలంగాణలో చంద్రబాబు తిరగలేరని ఆయన అన్నారు. దళిత కార్డును అడ్డం పెట్టుకుని మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడితే నియోజకవర్గం ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. చంద్రబాబు తన ఆస్తులతో బహిరంగ చర్చకు రావాలని, తమ నేత కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు వస్తారని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆరిపోయే దీపమని నాయని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు ఎకరాల నుంచి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. కెసిఆర్‌ను విమర్సిస్తే సూర్యుడిపై ఉమ్మేయడమేనని ఆయన అన్నారు. సొంత మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, చంద్రబాబు కథలు చిన్నపిల్లాడికి కూడా తెలుసునని, చంద్రబాబును ప్రజలను నమ్మబోరని ఆయన అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

తెరాసపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆయన అన్నారు. రైతుల నడ్డి విరిచింది చంద్రబాబేనని ఆయన అన్నారు. రాష్ట్రమంతా స్తంభించిపోతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎక్కడు నిద్రపోయారని, ఎక్కడ పడుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో అయిపోయారని ఆయన అన్నారు. తెరాసను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులకు దమ్ముంటే చర్చలకు రావాలని, తామే సమావేశం ఏర్పాటు చేస్తామని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్‌ను ఒక వ్యక్తి కోసం ఖరారు చేశారని, ఆ మనిషి ఎవరో ఎవరి కోసం ఆ టెండర్ ఖరారు చేశారో అందరికీ తెలుసునని చంద్రబాబు అంతకు ముందు అన్నారు. తెరాసను వసూల్ రాజా పార్టీగా ఆయన అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+