తెలంగాణ ఎమ్మెల్యేలు: వైయస్ తోవలో కిరణ్ కుమార్

శుక్రవారం హైదరాబాదులోని సెంట్రల్ కోర్టులో సమావేశమైన 11 మంది తెలంగాణ శాసనసభ్యుల తీరు చూస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ నాయకులను చీల్చడంలో విజయం సాధించారని అర్థమవుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని వారు నిర్ణయం తీసుకోవడమే కాకుండా తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సొంత ఎజెండాతో ముందుకు పోతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ఇక ఢిల్లీలోనే ఆందోళనలు చేయాలని కూడా వారు నిర్ణయించుకున్నారు. దీన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డికి ఇక తెలంగాణ నుంచి ఏ విధమైన ఇబ్బంది రాకుండా, వచ్చినా అడ్డుకోవడానికి వారు సమాయత్తమవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ కోసం ఎవరు ఆందోళనలు చేసినా మద్దతిస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. పార్లమెటు సభ్యుల ఆందోళనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెసులోని తెలంగాణవాద నాయకులకు కళ్లెం వేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఓ వర్గాన్ని తయారు చేసినట్లు చెప్పవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications