ఆంధ్ర విద్యాసంస్థల గ్రూప్‌పై రజత్ గుప్తా దెబ్బ

Rajat Gupta
హైదరాబాద్: ఐఎస్‌బి మాజీ చైర్మన్, మెకెన్సీ డైరెక్టర్ రజత్ గుప్తా వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ గ్రూప్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన రజత్ గుప్తా ఆ విద్యాసంస్థలో పెట్టుబడులకు హామీ ఇచ్చారు. శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ గ్రూప్ రాష్ట్రవ్యాప్తంగా గొలుసుకట్టు జూనియర్ కళాశాలలను, పాఠశాలలను నడుపుతోంది. ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం ప్రకారం - రజత్ గుప్తా సహ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూసిల్క్ రూట్ ప్రైవేట్ ఈక్విటీ శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ గ్రూపులో రూ. 325 కోట్ల పెట్టుబడికి గత నవంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది.

భారత విద్యాసంస్థలకు సంబంధించి ఇదే అత్యధిక విదేశీ పెట్టుబడి కావడం విశేషం. రజత్ గుప్తా వదిలేయడంతో న్యూ సిల్క్ రూట్ పెట్టుబడులు ఆ విద్యాసంస్థలకు రావడం అనుమానంగానే ఉంది. శ్రీచైతన్య ఆంధ్రప్రదేశ్‌లో 116 కళాశాలలను, పాఠశాలలను నడుపుతోంది. రాజ్ రాజరత్నంతో కలిసి రాజ్ గుప్తా న్యూ సిల్క్ రూట్‌ను ప్రారంభించారు. రాజ్ రత్నం పెట్టుబడులపై ఆరోపణలు వచ్చిన తర్వాత రాజత్ గుప్తా న్యూసిల్క్ రూట్‌కు దూరమైనట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో శ్రీచైతన్యకు నిధులు రావడం కల్లేనని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+